దీపావళి పండుగ సందర్భంగా మన మిత్రులకి & బంధువులకి పంపదగిన పండుగ శుభాకంక్షాలు ఇవే !
1. తెలుగింటి లోగిళ్లన్నీ కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ అన్నదాత కళ్లలో ఆనంద కాంతులు మెరవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
2. ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు.. ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం! – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
3. దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయకేతనం.. అవనికంతా ఆనంద విజయోత్సాహం.. అజ్ఞానపు చీకట్లు తొలగించే.. విజ్ఞాన దీపాల తేజోత్సవం.. – మీకు కుటుంబ సభ్యులందరికీ.. దీపావళి శుభాకాంక్షలు

4. ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు..
సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ..
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

5. దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..
సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..
– మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు

6. దీపావళి దివ్వకాంతుల వేళ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా మీకు, మీ కుటుంబ సభ్యలందరికీ సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ..దీపావళి శుభాకాంక్షలు
7. దుష్ట శక్తులను పారద్రోలి, కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే.. వెలుగుల పండుగే దీపావళి. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
8. అజ్ఞాన చీకట్లను పారద్రోలి.. మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

9. దీపావళి దివ్వకాంతుల వేళ
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా
మీకు, మీ కుటుంబ సభ్యలందరికీ
సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం
ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ..

10. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! నరకాసురుని వధించి.. నరులందరి జీవితాలలో వెలుగును నింపిన మాత సత్య సౌర్యానికి చెడుపై మంచి విజయానికి ప్రతీక ఈ దీపావళి…!!
11. చెడుపై మంచి విజయం సాధించినందుకు.. సీతారాములు అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భంగా.. మీ ఇంట చీకట్లు తొలగిపోయి.. వెలుగులు నిండాలని కోరుతూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు

12. అంతరంగంలో అంధకారం అంతరిస్తే.. వ్యక్తిత్వం వెలుగులీనుతుంది.. జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది. – మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు